సంఘం డెయిరీపై కోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు
సంఘం డెయిరీ పై కోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘సంఘం డెయిరీని ఆక్రమించాలన్న దురుద్దేశం నెరవేరకే టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పట్ల ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. తప్పుడు కేసులు కాబట్టే తీర్పుకు ముందే అరెస్టు చేయాలని అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతు సహకార డైరీలను నిర్వీర్యం చేసి అమూల్ కు అప్పచెప్పేందుకే జగన్‌రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.