గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఓ అభూత కల్పన
|
జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఈరోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ..ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై తీవ్రంగా స్పందించారు. విశాఖ పెట్టుబడుల సదస్సు ఓ అంకెల గారడీ అని, అంతా అభూత కల్పన అని కొట్టిపారేశారు. ప్రారంభమైన కంపెనీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్టు చూపించారని, రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న చేసిన 14 ప్రారంభోత్సవాల్లో 8 శ్రీసిటీలోనివేనని అన్నారు. కృష్ణపట్నం వద్ద స్టీల్ ప్లాంట్ కోసం గతంలోనే ఎంఓయూ చేసుకుని, ఇప్పుడు దాన్ని మరోసారి చూపించారని వివరించారు. తిరుపతి, విశాఖల్లో ఓబెయార్ సంస్థకు గతంలోనే భూములు కేటాయించగా, నిర్మాణాలు కూడా జరిగాయని, అయితే ఇప్పుడు విశాఖలో ఎంఓయూ చేసుకున్నారని, రూ.30 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|