నీలమణి దుర్గమ్మా.. కరుణించమ్మా!
|
ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం.. భక్తులపాలిట కల్పవల్లి.. శ్రీనీలమణి దుర్గమ్మ ఘటోత్సవం అంబరాన్నంటింది. పాతపట్నం భక్త జనసంద్రమైంది. తొమ్మిదేళ్ల తర్వాత నిర్వహించిన నీలమణి దుర్గమ్మ పెద్ద పండుగకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
జూబిలిరోడ్డు ఎగువ.. దిగువ వీధు లు, ప్రధాన రహదారి మీదుగా వీధుల వారీగా భక్తులంతా ఘటాలను వరుస క్రమంలో తీసుకెళ్లి.. అమ్మవారి ఆలయం వద్ద పూజలు చేశారు. బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. నీలమణి దుర్గమ్మా.. కరుణించమ్మా.. అని వేడుకున్నారు. పాతపట్నంలోని ప్రతి వీధిలోనూ విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకున్నాయి
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|