సరదా ముచ్చట్లు - చమత్కారాలు (unstoppable)
|
సరదా చమత్కారాలతో నారా చంద్రబాబు నాయుడు– నందమూరి బాలకృష్ణల మధ్య సంభాషణ సాగింది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్’ (unstoppable)కార్యక్రమం దీనికి వేదికైంది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రెండో సీజన్‌కు తొలి అతిథిగా నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బాలయ్య అడిగిన ప్రశ్నలకు సరదా సమాధానాలు ఇచ్చారు. అందులో ఆసక్తికర విషయాలు...
‘నేను ఎమ్మెల్యేగా 1978లో మొదటిసారి హైదరాబాద్ వచ్చా. అప్పట్లో జూబ్లీహిల్స్ అనేది నగరానికి చివరి ప్రాంతంగా ఉండేది. నా పెళ్లి అయ్యాక ‘నువ్వు ఓకే అంటే ఇక్కడ ఇల్లు కడతా’ అని మావయ్య చెప్పారు. ‘అడవిలా నిర్మానుష్యంగా ఉంది.. ఇక్కడికి రావాలంటే ఆటో సౌకర్యం కూడా లేదు. ఎవరొస్తారండీ అన్నాను. అప్పుడు నేను కాదనడంతో ‘మీ కోసం ఇల్లు కట్టారు(బాలకృష్ణను ఉద్దేశించి). ఆ తర్వాతి ఎన్నికల్లో నేను ఓడిపోయా. అప్పుడు మెహదీపట్నంలో ఓ చిన్న ఇంట్లో ఉండేవాడిని. అప్పుడు మావయ్య పిలిచి ‘బాలకృష్ణ చెన్నైలో ఉన్నాడు. నువ్వు మూడు నాలుగేళ్లు ఆ ఇంట్లో ఉండొచ్చు’ అని చెప్పారు. ఆయన మాటతో నేను జూబ్లీహిల్స్ ఇంటికి వెళ్లాను. అక్కడి పరిస్థితులన్నీ మారిపోయాయి. అడవిలా ఉందనుకున్న ప్రాంతాన్ని అంత అభివృద్ధితో చూడడంతో హైదరాబాద్‌కే కాదు తెలుగు జాతికి ఏదో చేయాలనుకున్నా. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్లాను. ఏం చేేస్త తెలుగు వారికి, దేశానికి ఉపయోగం ఉంటుంది? అనే కోణంలో ప్రపంచం మొత్తాన్ని అధ్యాయనం చేశా. అప్పుడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద దృష్టిపెట్టాను. ఐటీ గురించి మాట్లాడితే ‘టెలిఫోన్ అన్నం పెడుతుందా’ అని ఎగతాళిగా చేశారు. దాని విలువ ఏంటో ఇప్పుడు జనాలకు అర్ధమవుతుంది. భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు. భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది. కానీ ఫోన్ లేకుండా ఎవరూ ఉండలేరు. ఇప్పుడు ఐటీ ఎంతగా అభివృద్ధి చెందిందో కళ్ల ముందు కనిపిస్తోంది. ఈ విజన్ గురించి చెబితే నన్ను 420 అన్నారు.
‘‘1995లో మన కుటుంబంలో కొన్ని సమస్యలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. మనమంతా కలిసి పెద్దాయన దగ్గరకు వెళ్లాం. మనం ఎందుకు వెళ్లామో వారికి అర్థమైంది. మీతో మాట్లాడాలని అడిగితే ‘కుటుంబం గురించా? వేరే ఏమైనానా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయం గురించి అని చెప్పగానే మీ ఇద్దరినీ (బాలయ్య, హరికృష్ణ బయటకు పంపించారు. నేను ఆయనతో మూడు గంటలు మాట్లాడాను. ఒక్క సమావేశం నిర్వహించమని ఎన్నో రకాలుగా చెప్పా. ‘నా మాట వినండి’ అంటూ కాళ్లు పట్టుకున్నా. మీటింగ్ పెట్టి మాట్లాడితే ఏం జరగదని విన్నవించా. అప్పుడు అదొక రామాంజనేయ యుద్థంలాంటిది. ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? అని చంద్రబాబు.. బాలకృష్ణను అడిగారు. ‘ఆయన ఇష్టాలను మనం ఎప్పుడూ కాదనలేదు’’ అని బాలయ్య సమాధానమిచ్చారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|