తెలుగు సినిమా ప్రచారాలపై దీపిక పదుకొణె సంచలన నిర్ణయం
దీపిక పదుకొణె, రణవీర్ సింగ్ లు తల్లిదండ్రులం కాబోతున్నామని ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ నెలలో దీపిక 'సింగం అగైన్' హిందీ సినిమా చిత్రీకరణలో అదీ పోరాట సన్నివేశంలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు జూన్ 27న విడుదలవుతున్న 'కల్కి 2898 ఏడి' సినిమా ప్రచారాలు ఏ విధంగా చెయ్యాలన్న విషయంపై దీపిక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది
బాలీవుడ్ నటి దీపికా పడుకోన్, భర్త రణవీర్ సింగ్ తల్లిదండ్రులం కాబోతున్నాం అని ఫిబ్రవరిలో ప్రకటించారు. సెప్టెంబర్ లో తమ కాబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని కూడా చెప్పారు. త్వరలో అమ్మ కాబోతున్న దీపికా పదుకొణె అందరిలా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాలని అనుకోలేదు. నెలల గర్భవతిగా వున్న దీపిక ఈ సమయంలో కూడా తాను చెయ్యాల్సిన సినిమాలు పూర్తి చెయ్యాలని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.