ప్రముఖ నటుడు రవితేజ నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్తవాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ, చిన్న సినిమాలను తీస్తున్నారు. ఇప్పుడు 'సుందరం మాస్టర్' అనే సినిమాతో కళ్యాణ్ సంతోష్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేశారు. హాస్య నటుడిగా పలు చిత్రాలలో నటించిన హర్ష చెముడు ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు, దివ్య శ్రీపాద కథానాయకురాలు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.