మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ ఇంద్ర సినిమా టీవీ ప్రేక్షకులను అలరించనుంది. దాదాపు దశాబ్దం (2014) తర్వాత టీవీ ఛానల్‌లో ప్రసారానికి వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ఇంద్ర ఎట్టకేలకు టీవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. దాదాపు దశాబ్దం (2014) తర్వాత టీవీ ఛానల్‌లో ప్రసారానికి వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2002 జూలై 24న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రూ10 కోట్లతో నిర్మించబడ్డ ఈ చిత్రం రూ.80 కోట్ల వరకు రాబట్టి ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో హయ్యెస్గ్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డుల కెక్కింది.