అంతకంతకూ.
|
భారీ వర్షాల కారణంగా జిల్లాలో వరి పంట నష్టం అంతకంతకూ పెరుగుతోంది. మూడు రోజు లుగా కురిసిన కుంభవృష్టి వర్షంతో జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి చేలల్లోకి నీళ్లు చేరాయి. కోసిన పనలు చేలోనే కొట్టుకుపోయాయి. అటు చేలల్లో వేసిన వరికుప్ప ల్లోకి సైతం నీరు చేరి పనలు కుళ్లిపోయే పరిస్థితి తలెత్తింది. చివరకు గురువారం కూడా ఎక్కడా నీరు పూర్తిగా లాగలేదు. దీంతో పంట దాదాపుగా కుళ్లిపోయే పరిస్థితి తలెత్తింది. కానీ క్షేత్ర స్థాయి లో పర్యటిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు మాత్రం ఇదేదీ పట్టించుకోవడం లేదు. తోచినకాడికి లెక్కలు సిద్ధం చేస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం తీవ్రత ఎక్కు వగా చూపితే ప్రభుత్వం ఏమంటుందోననే భయంతో అధికారులు మాత్రం నష్టం తీవ్రతను తక్కు వగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానాలను రైతులు వ్యక్తంచేస్తున్నారు. తాజాగా గురువారం నాటికి జిల్లావ్యాప్తంగా 19,429 హెక్టార్లలో మాత్రమే వరి మునిగినట్లు లెక్కగట్టడం విశేషం. అంటే 48,572 ఎకరాల్లో మాత్రమే మునిగినట్టు గుర్తించారు. ఇందులో అత్యధికంగా తొం డంగి మండలంలో 3,604 హెక్టార్లు, కోటనందూరు 1650, తుని 1,065, గొల్లప్రోలు 1,408, ప్రత్తి పాడు 1,640, జగ్గంపేట 1,428 హెక్టార్ల చొప్పున దెబ్బతినట్లు అంచనా వేశారు. అయితే శుక్రవారా నికి మరికొంత పెరగవచ్చని అధికారులు వివరించారు. కాగా ఉద్యానవన పంటలు సైతం భారీగా దెబ్బతిన్నాయి.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|