గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్
|
మిచౌంగ్ తీవ్ర తుఫాన్ పశ్చిమ మధ్య బంగాళఖాతంలో కోనసాగుతోంది. ఉత్తర దిశగా ముందుకు కదులుతోంది. ఇది దక్షిణ కోస్తా తీరాన్ని అనుకుని కోనసాగుతోంది. తీరం ప్రాంతంలో ఉన్న ల్యాండ్‌ను కూడ తాకుతూ వెళ్తోంది. నెల్లూరు ప్రాంతంలో కొంత ల్యాండ్ మీదుగా పయనించింది. ఇది ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం చెన్నైతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్నిగంటల్లో బాపట్ల సమీపంలో తీరాన్ని తాకే ఆవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు.. కొన్ని సార్లు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మత్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|