వామ్మో మిచాంగ్.. గంటకు ఎన్ని కి.మీ వేగంతో దూసుకొస్తుందంటే..!
|
‘‘మిచాంగ్’’ తుఫాన్ (Cyclone Michaung) వేగంగా కదులుతోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. తీవ్రతుఫాన్‌గా బలపడిన మిచాంగ్.. గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 90 కిలోమీటర్లు, నెల్లూరుకు 140 కిలోమీటర్లు, బాపట్లకు 270 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు(మంగళవారం) ఉదయం నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా మిచాంగ్ తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు, రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతితీవ్రభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|