డెల్టాకు గంగమ్మ పరుగు
|
సోమశిల డ్యాం నుంచి డెల్టాకు సోమవారం అధికారులు నీరు విడుదల చేశారు. తొలుత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి సారె వదిలారు. అనంతరం 12వ క్రస్ట్ గేటు ఎత్తి 1800 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమశిల ఈఈ దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఐఏబీలో తీసుకొన్న నిర్ణయం మేరకు ఉన్నత అధికారుల ఆదేశాలతో నీటి సరఫరా చేశామని చెప్పారు. ఎగువ నుంచి డ్యాంకు వచ్చే ఇన్‌ఫ్లో అనుసరించి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల మోతాదును పెంచుతామన్నారు. ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని పొదుపుగా నీరు వాడుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|