దళిత రైతుల రుణాలు మాఫీ చేసి.. సర్వహక్కులు కల్పించబోతున్నాం..
|
దశాబ్ధాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని నూజివీడులో ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పెత్తందార్లకు పేదలను పిలవడం నచ్చదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారిగా భూ సర్వే చేస్తున్నామన్నారు. రెండు విడతల సర్వే పూర్తైందని.. మూడో విడత ప్రారంభించబోతున్నామన్నారు.27లక్షల 42 వేల ఎకరాలకు సంబంధించి16 లక్షల 21వేల మందికి హక్కులు కల్పించబోతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్ భూములను అత్తగారి సొత్తులా భావించి స్వాధీనం చేసుకునేవారన్నారు. చుక్కల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చంద్రబాబు చేర్చారని జగన్ పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములపై దళిత రైతుల రుణాలు మాఫీ చేస్తూ, సర్వ హక్కులు కల్పించబోతున్నామన్నారు. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మూడు కేటగిరీలుగా పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని జగన్ వెల్లడించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|