రెండు రోజుల్లో కేరళ!
|
నైరుతి రుతుపవనాలు మరో రెండ్రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది.
48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకితే.. రాషా్ట్రనికి విస్తరించాలంటే జూన్ మూడో వారం అయ్యే అవకాశముంది. మరోవైపు రాగల మూడ్రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావారణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|