147ఎకరాల నక్కపల్లి భూములపై పెద్దల కన్ను
|
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో సుమారు 147 ఎకరాల వివాదాస్పద భూములను ఓ వైసీపీ నేత అడ్డగోలుగా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) చేయించుకున్నారు. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతంలో రిజిస్ర్టేషన్ విలువ ఎకరా రూ.7.65 లక్షలు, మార్కెట్ ధర ప్రకారం రూ.25 లక్షలు. ఈ లెక్కన జీపీఏ రూపంలో చేతులు మారిన ఈ భూముల విలువ రూ.35 కోట్లకుపైగా ఉంటుంది. సదరు నేత ప్రస్తుతం ఏపీ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కావడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే... నక్కపల్లి మండలం పెదదొడ్డిగల్లు రెవెన్యూ సర్వే నంబర్-1లో 334 ఎకరాల భూములు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా పెదదొడ్డిగల్లు, సీతంపాలెం గ్రామాలకు చెందిన పేదలు ఈ భూములను సాగు చేసుకుంటూ, తమ పశువులు, మేకలు, గొర్రెలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. 1984లో స్థానిక సర్పంచ్, గ్రామ పెద్దలు సమావేశమై ఒక్కో కుటుంబం 75 సెంట్ల చొప్పున సాగు చేసుకోవాలని తీర్మానించి, వీరికి డి.పట్టాలు మంజూరు చేయాలంటూ అప్పటి నక్కపల్లి తాలూకా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|