‘ఎగ’సాయం
|
‘‘రైతును చేయి పట్టుకుని నడిపిస్తాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అన్ని దశల్లో అండగా ఉంటాం. వ్యవసాయ రంగానికి రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ జగన్ సర్కార్ చెబుతున్న గొప్పలు ఇవి. ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. రైతులు పెట్టుబడి భారం మోయలేక సతమతమవుతున్నారు. జగన్ సర్కారు పంట రుణాలకు పావలా వడ్డీ ఎత్తేసింది. రైతులు వడ్డీతో సహా రుణాన్ని చెల్లించాకే సున్నా వడ్డీ రాయితీ జమ చేస్తుండడంతో అవసరానికి సాయం అందడం లేదు. ఇక కౌలురైతులను ప్రభుత్వం గాలికొదిలేసింది. బ్యాంకు రుణాలు అందకపోవడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోంది.
గత ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ పంట రుణాలను అమలు చేసింది. వడ్డీ భారం తగ్గడంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలిగేది. జగన్ సర్కార్ వచ్చాక పావలా వడ్డీకి రుణాలు ఇవ్వడం లేదు.
లక్షలోపు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తేనే.. వైఎస్సార్ సున్నా వడ్డీ రాయి తీ అమలు చేస్తోంది. రూ.లక్షపైన తీసుకునే రుణాలకు 7ు వడ్డీ వసూలు చేస్తున్నారు. మూడున్నరేళ్లలో జగన్ సర్కార్ సున్నా వడ్డీ కింద ఇచ్చిన వడ్డీ రాయితీ రూ.487.4 కోట్లు మాత్రమే. ఈ ఏడాది ఖరీఫ్ ముగుస్తున్నా.. నిరుటి వడ్డీ రాయితీ ఇంకా ఇవ్వలేదు. వచ్చే నెలలో చెల్లిస్తామని చెబుతున్నారు. 2020-21 రబీలో తీసుకున్న రుణాలను రైతులు తిరిగి చెల్లించి ఆరు నెలలవుతోంది. రైతులు చెల్లించిన వడ్డీపై ప్రభుత్వానికి వడ్డీ వస్తోంది. 2014-15 నుంచి 2018-19 వరకు పెండింగ్‌లో ఉన్న రూ.784.71 కోట్లు విడుదల చేశామని చెబుతున్న ప్రభుత్వం తమ హయాంలో చెల్లింపులపై తాత్సారం చేస్తోందని రైతులు అంటున్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|