స్మార్ట్‌గా వడ్డింపు!
|
జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల పేరుతో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ భారం మోపి, ఆ తప్పు తమది కాదని వీఎంఆర్‌డీఏ, డీటీసీపీ అధికారులు తప్పించుకుంటున్నారు. వడ్డీతో కలిపి వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి పెడుతున్నారు.
ఆనందపురం మండలంలో మధ్య తరగతి ప్రజల కోసం నాలుగుచోట్ల ఎంఐజీ లేఅవుట్లు వేయగా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన పాలవలసలో ముందు ప్లాట్ల విక్రయం ప్రారంభించారు. గజం రూ.14,500 చొప్పున 94 మందికి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విక్రయించారు. ముందుగా ప్లాటు విలువలో 10 శాతం కట్టించుకొని, మిగిలి మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించాలని సూచించారు. ఒప్పందం చేసుకున్న నెల రోజుల్లో పూర్తి మొత్తం చెలిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. అంతా ఆన్‌లైన్ ప్రక్రియ అని, మెసేజ్ వచ్చిన వెంటనే సొమ్ములు కట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇక్కడ విశేషం ఏమిటంటే...రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌ల లేఅవుట్లు వేసి, ప్లాట్ల విక్రయం నగరాభివృద్ధి సంస్థలు, మునిసిపాలిటీలు చేస్తే...వాటికి సంబంధించిన పేమెంట్లన్నీ డీటీసీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళతాయి. వీటికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను డీటీసీపీ తయారుచేసింది.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|