పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడనున్న టీమిండియా?.. క్రికెట్ ఫ్యాన్స్ నమ్మలేని అప్‌డేట్
చాలాకాలం తర్వాత భారత క్రికెట్ జట్టు (Team India) పాకిస్తాన్ (Pakistan) గడ్డపై అడుగుపెట్టనుందా ?. పాక్ క్రెడిట్ అభిమానుల మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఆడనుందా? అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) వేదికగా ‘ఆసియా కప్ 2023’ (Asia cup 2023) జరగనుండడమే ఇందుకు కారణమైంది. పాక్ వేదికగా జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియాకు బీసీసీఐ (BCCI) అనుమతి ఇస్తుందా లేదా అనే దానిపై సందేహాలు ఉన్నప్పటికీ... టీమిండియాను పాకిస్తాన్ పంపించేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే బీసీసీఐ అనుమతిపైనే తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. వార్షిక సాధారణ సమావేశానికి ముందు అన్ని రాష్ట్రాల అసోసియేషన్లకు బీసీసీబీ బోర్డ్ ఈ మధ్య ఒక లెటర్‌ను పంపింది. టీమిండియాను పాకిస్తాన్‌కు పంపడంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నాయని సమాచారం.
కాగా ఆసియా కప్ 2023కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. 50 - ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఆసియా కప్ తర్వాత భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 18న బీసీసీఐ వార్షిక సాధారణ భేటీలో ఈ అంశాలపై చర్చ జరనుందనే అంచనాలున్నాయి.
ఇక 2012-13 తర్వాత భారత్ - పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు ఒక్కటి కూడా జరగలేదు. భారత్ జట్టు చివరిసారిగా పాకిస్తాన్‌లో 2005-06లో పర్యటించింది. 3 టెస్టులు, 5 వన్డేలు ఆడిన నాటి జట్టుకు రాహుల్ ద్రావిడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక టీమిండియా చివరిసారిగా 2012-13లో పాకిస్తాన్‌లో పర్యటించింది. 3 టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగలేదు. ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి వేదికలపై మాత్రమే ఇరుజట్లు తలపడ్డాయి.