అలవోకగా ఫైనల్‌కు
అంచనాలకు తగ్గట్టుగానే భారత మహిళల క్రికెట్‌ జట్టు ఆసియాకప్‌ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం థాయ్‌లాండ్‌తో ఏకపక్షంగా ముగిసిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సేన 74 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. స్పిన్నర్‌ దీప్తి శర్మ (4-1-7-3) సంచలన బౌలింగ్‌తో అదరగొట్టింది. శనివారం భారత జట్టు శ్రీలంకతో జరిగే టైటిల్‌ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు ఇప్పటిదాకా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో భారత్‌ కేవలం పాక్‌ చేతిలోనే ఓడిపోయింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (30 బంతుల్లో 4 ఫోర్లతో 36) రాణించారు. స్పిన్నర్‌ టిపోచ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో థాయ్‌లాండ్‌ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులే చేయగలిగింది. బూచథమ్‌ (21), చైవై (21) టాప్‌ స్కోరర్లు. దీప్తి శర్మకు మూడు, రాజేశ్వరికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా షఫాలీ నిలిచింది. 
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News National News
పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడనున్న టీమిండియా?.. క్రికెట్ ఫ్యాన్స్‌ నమ్మలేని అప్‌డేట్ [15 Oct 2222 11:10 am]
అలవోకగా ఫైనల్‌కు [14 Oct 2222 11:10 am]
టీమిండియా ఆసీస్‌ పయనం [07 Oct 2222 12:10 pm]
ఈ బంగారు పతకం ప్రత్యేకం: ఇషా సింగ్ [03 Oct 2222 11:10 am]
ఏడేళ్ల తర్వాత సంబరం.... [29 Sep 2222 11:09 am]
sports national [16 Mar 2020 10:03 pm]
national sports [16 Mar 2020 10:03 pm]
bottom
rightpane