టీమిండియా ఆసీస్‌ పయనం
టీ20 ప్రపంచక్‌పలో పాల్గొనేందుకు భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని 14 మంది సభ్యులతో పాటు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సహాయక సిబ్బంది గురువారం తెల్లవారుజామున ముంబై నుంచి పెర్త్‌కు పయనమయ్యారు. ఈమేరకు క్రికెటర్ల గ్రూప్‌ ఫొటోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అలాగే కోహ్లీ, హార్దిక్‌, చాహల్‌, సూర్యకుమార్‌, పంత్‌ కూడా తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఫొటోలను పోస్ట్‌ చేశారు.
పెర్త్‌లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో భారత జట్టు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అయితే గాయపడిన బుమ్రా స్థానంలో మరో పేసర్‌ను బోర్డు ప్రకటించాల్సి ఉంది. అలాగే స్టాండ్‌బై జాబితాలో ఉన్న వెటరన్‌ పేసర్‌ షమికి ఇంకా ఫిట్‌నెస్‌ టెస్టు జరపలేదు. ఈనెల 12న రిజర్వ్‌ ఆటగాళ్లు కూడా ఆస్ర్టేలియా వెళ్లనున్నారు. కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ సెమీ్‌సకు కూడా చేరలేకపోయిన సంగతి తెలిసిందే.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News National News
పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడనున్న టీమిండియా?.. క్రికెట్ ఫ్యాన్స్‌ నమ్మలేని అప్‌డేట్ [15 Oct 2222 11:10 am]
అలవోకగా ఫైనల్‌కు [14 Oct 2222 11:10 am]
టీమిండియా ఆసీస్‌ పయనం [07 Oct 2222 12:10 pm]
ఈ బంగారు పతకం ప్రత్యేకం: ఇషా సింగ్ [03 Oct 2222 11:10 am]
ఏడేళ్ల తర్వాత సంబరం.... [29 Sep 2222 11:09 am]
sports national [16 Mar 2020 10:03 pm]
national sports [16 Mar 2020 10:03 pm]
bottom
rightpane