విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయం..!
|
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వస్తున్న కేసీఆర్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వెంటనే విశాఖ వెళ్లి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లో అధికారుల బృందం విశాఖకు వెళ్లనుంది.వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామిగా చేరేందుకు ఉక్కు, ముడి ఉక్కు తయారీపై ఆసక్తి ఉన్న సంస్థల నుంచి వ్యాపార ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ మార్చి 27న యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. ఈవోఐ దాఖలు చేసే సంస్థలు ఉక్కు లేదంటే ఉక్కు తయారీ ముడిపదార్థాల వ్యాపారం చేసి ఉండాలి. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని బట్టి చూస్తుంటే ఏపీలోని ఉత్తారాంధ్రపై ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ.. ప్రైవేటీకరణను తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఉన్న అవసరమైన పరిష్కార మార్గాలను వారు సూచించారు. వాటిని ఆయన కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసీఆర్ నిన్న ఈ విషయమై ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో చర్చించారు. అనంతరం ఈవోఐలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ టెండర్లు కనుక తెలంగాణ ప్రభుత్వ సొంతమైతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై తమ పార్టీ వ్యతిరేకతను బలంగా చాటచ్చొన్నది కేసీఆర్ అభిప్రాయం.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|