వాణిజ్య గ్యాస్‌పై శుభవార్త
|
గ్యాస్ వినియోగదారులు నెల మార్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్యాస్ ధరలు ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి అనే విషయాలపై ఆసక్తి చూపుతున్నారు. గత నెలలో గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు కంపెనీలు నేడు 2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజున LPG గ్యాస్ సిలిండర్ ధరలను సవరించినట్లు ప్రకటించాయి.
19 కిలోల గ్యాస్ సైక్లిండర్‌పై 92 రూపాయలు తగ్గాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే ధరలు తగ్గింపుతో కాస్త ఉపశమనం లభించింది. 14.2 కిలోల గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా కొనసాగుతున్నాయి. గత నెలలో దేశీయ వంటగ్యాస్ మీద 50 రూపాయలు మేర ధరను పెంచాయి చమురు సంస్థలు. కాగా మార్చిలో ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను 350 రూపాయలు పెంచింది. ప్రస్తుతం 92 రూపాయలు తగ్గించింది. గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలలో తగ్గింపు లేకపోవడం సామాన్య, మధ్యతరగతి ప్రజలను నిరాశకు గురి చేసింది
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|