విప్రో లాభం రూ.2,659 కోట్లు
|
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి విప్రో రూ.2,659 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.2,930.6 కోట్ల లాభంతో పోలిస్తే 9.3 శాతం తగ్గింది. సిబ్బంది వ్యయాలు పెరగడంతోపాటు అమెరికాయేతర మార్కెట్ల నుంచి ఆదాయం తగ్గడం ఇందుకు కారణం. ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి ప్రకటించిన రూ.2,563.6 కోట్ల లాభంతో పోలిస్తే మాత్రం 3.72 శాతం వృద్ధి నమోదైంది. ఇక ఆదాయం విషయానికొస్తే, ఈ క్యూ2లో రూ.22,539.7 కోట్లకు చేరుకుంది. గత ఏడాది రెండో త్రైమాసికాదాయం రూ.19,667.4 కోట్ల ఆదాయంతో పోలిస్తే 14.60 శాతం వృద్ధి కనబరిచింది. క్యూ2లో విప్రో నిర్వహణ మార్జిన్ 0.16 శాతం వృద్ధి చెంది 15.1 శాతానికి పెరిగింది. రెండో త్రైమాసికంలో 10,000 మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని విప్రో వెల్లడించింది. కాగా, ఈ కాలానికి కంపెనీ ఉద్యోగుల వలసల రేటు స్వల్పంగా తగ్గి 23 శాతానికి పరిమితమైంది. సెప్టెంబరు 30 నాటికి కంపెనీలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది సంఖ్య 2,59,179.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|