కల్యాణ వైభోగమే
|
పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత వేంకటేశ్వరస్వామి దేవస్థానం త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణలతో చిట్టినగర్ ప్రాంతమంతా భక్తి పారవశ్యంతో పులకరించింది. ఉదయం ఉత్సవ విగ్రహలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం నిత్యహోమం, బలిహరణ నిర్వహించారు. మండపంలో పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత వేంకటేశ్వరస్వామికి విశేష అలంకారం చేసి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. సాయంత్రం నిత్యహోమం, బలిహరణాదులు, ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. కల్యాణ మహో త్సవంలో వేలాది భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని విశేషపూజలు చేశారు. ఉభయధాతలు కుంకుమార్చన, కల్యాణంలో పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలుగ కుండా ఆలయ కమిటీ చైర్మన్ లింగిపిలి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధి కారి పిళ్లా శ్రీనివాసరావు పర్యవేక్షించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|