కనుల పండువగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
|
మండల కేంద్రంలోని లక్ష్మీ నర్సింహ్మస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్ర వారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పల్లకీలో బాజాభజంత్రీలు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా రథం వద్దకు తీసుకు వచ్చి రథంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, ప్రజలు రథాన్ని లాగారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించారు. సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆల య కమిటీ సభ్యులు ఆంజనేయులు, దండు సత్యప్ప, వాకిటి శ్రీనివాసులు, పరుశరాములు, దండు శరణప్ప, కృష్ణయ్య, పురుషోత్తంరెడ్డి, మధు సూదన్‌రెడ్డి, పి.ఆంజనేయులు, చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|