భూమి మార్కెట్ విలువను ఉపసంహరించుకోవాలి.
|
రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్న భూముల మార్కెట్ విలు వలను ఉపసంహరించు కోవాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇరిగినేని పుల్లారెడ్డి డిమాండ్ చేశారు. సోమవా రం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మా ట్లాడుతూ గత నెలలో రిజిస్ట్రేషన్‌లపై 10 రెట్లు పెంచిన యూజర్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఆస్తి విలువ పెంచితే ఇంటి, చెత్త, డ్రైనేజీ పన్నులు కూడా పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో క్రేడాయ్ ఉపాధ్యక్షుడు ఏకే.భరత్‌రెడ్డి, కే.ఈ జగదీష్‌కుమార్, మాజీ అద్యక్షుడు గోరంట్ల రమణ, బిల్డర్స్ యజమానుల సంఘం నాయకుడు జి.సత్యనారాయణరెడ్డి, పీపీఎస్‌ఎస్ సంఘం సభ్యులు నాగరాజు పాల్గొన్నారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|