డిగ్రీలు ఇచ్చారు.. పదవి మరిచిపోయారు.
|
బాపులపాడులో రెండో విడత ఇళ్ల స్థలాల పంపిణీ జరిగి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు స్థలాలు చూపించలేదు. స్థలాల కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాపులపాడులో రెండో విడత ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి మూడు నెలలు అవుతోంది. ఇంత వరకు స్థలాలు చూపించలేదు. స్థలాల కేటాయింపులో తీవ్ర జాప్యం చేస్తుండడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరో పక్క ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపఽథ్యంలో స్థలాలు చేతికి రావేమోనని భయడుతున్నారు. బాపులపాడు గ్రామంలో మొదటి విడత 630 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. నూజివీడు రైల్వేస్టేషన్ సమీపంలో 20 ఎకరాల రైతువారీ భూమిని కొనుగోలు చేసి అందులో పేదలకు స్థలాలు కేటాయించారు. అప్పుడే 300 మందికిపైగా అర్జీదారులు మిగిలారు. రెండో విడత ఇళ్లస్థలాల పంపిణీ కోసం మొదటి లేఅవుట్ సమీపంలోనే మరో 19.80 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిలో 636 మందికి రెండో విడత స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న బాపులపాడు మార్కెట్‌యార్డ్‌లో ఎమ్మెల్యే వంశీ మోహన్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Reporter Name: Rao VSRao Reporter Email: vzm1@yahoo.co.uk
|
|
|
|