యువత గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారు?
కరోనా తర్వాత యువకుల్లో గుండెపోటులు ఎక్కువయ్యాయి. ఒకేసారి కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. గత పది రోజుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగా తాజాగా ఏపీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మరణించాడు.పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణం పసుమరుకు చెందిన షేక్ ఫిరోజ్(17) విద్యార్థి అర్ధరాత్రి రెండు 2 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఎప్పటిలానే కుటుంబసభ్యులతో కలిసి రాత్రి భోజనం చేసిన ఫిరోజ్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో కేకలు వినపడడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా, గుండెలో నొప్పి వస్తోందని చెప్పాడు. ఖంగారుపడ్డ తల్లిదండ్రులు హుటాహుటీన అతనిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

నాల్గు రోజుల క్రితం హైదరాబాద్ సీఎంఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలా అతి చిన్న వయసులో గుండెపోటుకు గురి అవుతుండడం తో అందరిలో ఆందోళన పెరుగుతుంది.
Reporter Name: Rao VSRao
Reporter Email: vzm1@yahoo.co.uk
తాజా వార్తలు Latest News Global News
యువత గుండెపోటుతో ఎందుకు చనిపోతున్నారు? [08 Mar 2323 03:03 pm]
WT20 UPDATES [30 Oct 2222 04:10 pm]
ప్రపంచ వరల్డ్ 6-రెడ్ స్నూకర్ చాంప్ శ్రీకృష్ణ.... [06 Oct 2222 03:10 pm]
జొకోవిచ్ ఖాతాలో 89వ సింగిల్స్ టైటిల్.. [04 Oct 2222 12:10 pm]
టీ 10 లీగ్ లో ఆడనున్న హర్భజన్,రైనా.... [01 Oct 2222 12:10 pm]
అక్టోబర్ 6 నుంచి ప్రపంచకప్ టికెట్లు....... [30 Sep 2222 12:09 pm]
శుభి, చార్వీలకు టైటిళ్ళు [28 Sep 2222 02:09 pm]
global sports [16 Mar 2020 10:03 pm]
bottom
rightpane